ప్రైవేట్ పాట చిత్రీకరణ కోసం ఏర్పాటు చేస్తున్న కటౌట్ కూలి కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఏదులాబాద్ గ్రామంలోని లక్ష్మీనారాయణ చెరువు కట్ట వద్ద రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై పాటను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా మంత్రి కటౌట్ భారీ ఎత్తున ఏర్పాటు చేసే సమయంలో ఒకేసారి కుప్పకూలింది. దీంతో రహమత్ నగర్‌కు చెందిన చంద్రశేఖర్ అనే కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 వాహనానికి సమాచారం ఇచ్చారు.
అరగంట అవుతున్న అంబులెన్స్ రాకపోవడం వల్ల పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి చెప్పారు దీంతో ఘట్కేసర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆ తర్వాత 108 వాహనం రావడంతో ప్రాథమిక చికిత్స చేసి నగరంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు ఈ పాటను చిత్రీకరిస్తున్న నిర్వాహకులు తమ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని పోలీసులు, పంచాయతీ అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: కరోనా భయాన్ని పోగొట్టేందుకు ప్రభుత్వం కృషి: ఈటల