వీధుల్లో కుక్కులు రెచ్చిపోతున్నాయి. కనబడిన వారినళ్లా కరుస్తున్నాయి. తాజాగా మేడ్చల్ జిల్లా మౌలాలీలో శునకాలు అలీ అనే ఎనిమిదేళ్ల బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఇంట్లోంటి బయటకు వచ్చిన చిన్నారిపై 15 కుక్కలు చుట్టుముట్టి దాడి చేశాయి. ఒళ్లంతా కరిచాయి. శునకాలను చెదరగొట్టిన స్థానికులు అలీని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని... ఫిట్స్ వస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
అధికారుల నిర్లక్ష్యం
రంజాన్ మాసం కావడం వల్ల తామంత ఉపవాస దీక్షలో ఉండగా పిల్లాడు బయటకు వెళ్లిన విషయాన్ని గమనించలేదు అని తండ్రి జాకీర్ తెలిపారు. ఉపవాస దీక్ష అయిపోయిన వెంటనే బాబు కోసం చూడగా అతన్ని వీధికుక్కలు కరిచినట్లుగా తెలిసిందన్నారు. ఈ ఘటనపై పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గరువుతున్నారు. వీధి కుక్కల విషయంలో తాము ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇవీ చూడండి: జూన్ 4న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు