సూరారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని 58 మంది రక్త నమూనాలు సేకరించి కరోనా పాజిటివ్ పరీక్షలు చేయగా అందులో 9 మందికి పాజిటివ్ ఉన్నట్టు తేలింది. వీరిని ప్రైమరీ కాంటాక్టు కేసులుగా పేర్కొంటూ మండల వైద్యాధికారి నిర్మల ప్రకటన చేశారు. కుత్బుల్లాపూర్ రుక్మిణీ ఎస్టేట్‌కు చెందిన ఓ వ్యక్తికి గతంలో పాజిటివ్ వచ్చింది. తాజాగా అతడి భార్య, కూతురు రక్త నమూనాలు పరీక్షించారు. వారికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు పరీక్షల్లో తేలింది.
పేట్ బషీరాబాద్‌లోని ఓ విల్లాలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. జీడిమెట్లలో ఒకే ఇంట్లో ఉండే ఇద్దరు వ్యక్తులకు పాజిటివ్ వచ్చింది. చింతల్‌కు చెందిన భగత్‌సింగ్ నగర్ కాలనీకి చెందిన ఒకరికి, షాపూర్ నగర్లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరే కాకుండా..నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మరో నలుగురికి కూడా కరోనా వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. మొత్తంగా ఈ ఒక్కరోజే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇవీ చూడండి: ఎమ్మెల్యే రాజాసింగ్ గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్