ETV Bharat / state

'మహిళలు ఎలా ఉండాలో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి' - మేడ్చల్ జిల్లా తాజా వార్తలు

మల్లారెడ్డి యూనివర్సిటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి హాజరయ్యారు.

Women's Day celebrations at Mallareddy University in medchal district
'మహిళలు ఎలా ఉండాలో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి'
author img

By

Published : Mar 8, 2021, 10:25 PM IST

మహిళలు ఎలా ఉండాలో ఎవరికి వారే నిర్ణయించుకోవాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి, తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవితో కలిసి కవిత హాజరయ్యారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ ఐటీ సంస్థలలో 25 శాతం మాత్రమే మహిళలు ఉన్నారని కవిత పేర్కొన్నారు. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసే సంప్రదాయం చాలా వరకు తెలంగాణలో తగ్గిపోయిందన్నారు. 18 ఏళ్లలోపు వారికి పెళ్లి చేస్తే కల్యాణలక్ష్మి పథకం వర్తించదని.. సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో ఈ నియమం పెట్టారని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: మహిళలకు తెదేపా ఎప్పుడూ పెద్దపీట వేస్తుంది: ఎల్​.రమణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.