ETV Bharat / state

వైద్యం వికటించి.. మహిళ మృతి - latest news on woman died due to operation failed

వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందిన ఘటన మెదక్​ జిల్లాలో చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

woman died due to operation failed
వైద్యం వికటించి.. మహిళ మృతి
author img

By

Published : Apr 20, 2020, 6:45 AM IST

మెదక్ జిల్లా చిలప్​చెడ్​ మండలం రహీంగూడా తండాలో విషాదం చోటుచేసుకుంది. వైద్యం వికటించి నునావత్​ శాంతి అనే మహిళ మృతి చెందింది. రహీంగూడా తండాకు చెందిన నునావత్ శాంతి కడుపు నొప్పితో బాధపడుతూ కౌడిపల్లిలోని శ్రీ వెంకటేశ్వర నర్సింగ్ హోమ్​ ఆస్పత్రికి వెళ్లింది. ఆసుపత్రి నిర్వాహకులు, ఆర్​ఎంపీ డాక్టర్​ అయిన సుధాకర్ మహిళకు గర్భసంచి ఆపరేషన్ చేశారు. అప్పటి నుంచి అస్వస్థతకు గురైన శాంతి.. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ చికిత్స చేయించుకుని ఇంటికి రాగా.. ఆదివారం సాయంత్రం మృతి చెందింది.

ఫలితంగా శాంతి బంధువులు శ్రీ వెంకటేశ్వర నర్సింగ్ హోమ్​ ఆస్పత్రి నిర్వాహకులు సుధాకర్​పై చిలప్‌చెడ్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నర్సాపూర్​ సీఐ నాగయ్య తెలిపారు.

ఆర్ఎంపీ డాక్టర్​గా చలామణి అవుతున్న సుధాకర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మరో మహిళకూ గర్భసంచి ఆపరేషన్ చేయగా.. ఆమె సైతం అస్వస్థతకు గురైనట్లు సీఐ పేర్కొన్నారు. సుధాకర్​పై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు తెలిపారు.

ఇవీచూడండి: అన్నార్తుల ఆకలి తీరుస్తున్న క్రియా స్వచ్ఛంద సంస్థ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.