ETV Bharat / state

కరోనా వేళ నిబంధనలు గాలికొదిలేసిన మందుబాబులు! - తెలంగాణ వార్తలు

కొంతమంది మందు బాబులకు కరోనా గురించి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. కనీసం మాస్కు లేకుండా దర్జాగా మద్యం దుకాణాలకు వచ్చి కోనుగోలు చేస్తున్నారు. మరికొందరు కరోనా తమని ఏం చేయదు అన్నట్టు బార్లలో కూర్చొని యథేచ్ఛగా మద్యం సేవిస్తున్నారు. కరోనా వేళ ఉమ్మడి మెదక్ జిల్లాలో పరిస్థితిపై ఈటీవీ భారత్ కథనం.

corona rules at wine shops, wine shop situation in medak
వైన్ షాపుల వద్ద కరోనా నిబంధనలు కరవు, మెదక్ జిల్లాలో వైన్ షాపుల పరిస్థితి
author img

By

Published : Apr 19, 2021, 12:16 PM IST

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్నా మద్యం దుకాణాలు కళకళలాడుతున్నాయి. మందు బాబులతో వ్యాపారం మూడు సీసాలు.. ఆరు పెగ్గులు అన్నట్లుగా ఉంది. మత్తు కోసం ఆరాటపడే క్రమంలో కరోనా మహమ్మారి గురించి పట్టించుకోవడం లేదు. దుకాణాల ముందు మాస్కు లేకుంటే మద్యం లేదు అన్న బోర్డులు నామమాత్రంగా పెట్టారు. కానీ అమలు విషయం గాలికొదిలేశారు. కరోనా వేళ ఉమ్మడి మెదక్ జిల్లాలోని మద్యం దుకాణాలు దాదాపు అన్నీ ఇలాగే వ్యవహరిస్తున్నాయి.

నిబంధనలు గాల్లో...

చాలా చోట్ల మాస్కు లేకుండానే కొనుగోళ్లు చేస్తున్నారు. దుకాణాదారులు సైతం ఇష్టానుసారంగా అమ్ముతున్నారు. ఇక కౌంటర్ల ముందు భౌతిక దూరం ప్రసక్తే లేదు. లాక్ డౌన్ తర్వాత మద్యం దుకాణాలు తెరిచినప్పుడు ప్రారంభంలో భౌతిక దూరం పాటించేలా గుర్తులు వేశారు. క్రమంగా ఆ గుర్తులు పోయాయి.. కనీసం దూరం పాటించాలన్న ఆలోచనా పోయింది.

అందరూ పాటించాలి..

కొన్ని చోట్ల దుకాణాల నిర్వాహకులు మాస్కు పెట్టుకున్న వారికే మద్యం విక్రయిస్తున్నారు. మాస్కు లేని వారిని కనీసం అమ్మడం నిషేధించారు. అన్ని దుకాణాలు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: అడ్డసరం మొక్కలో.. కరోనా ప్రభావం తగ్గించే జన్యువులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.