అనారోగ్యానికి గురైన ఆర్టీసీ కండక్టర్ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. 2008 నుంచి మెదక్ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న కౌడిపల్లి మండలం సలాబత్పూర్కు చెందిన షేక్ జాఫర్ ఈ నెల 13న ఇంట్లోనే తీవ్రఅస్వస్థతకు గురయ్యాడు. తార్నాక ఆర్టీసీ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించగా మెరుగైన వైద్యం కోసం మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉదయం తుదిశ్వాస విడిచారు.
ఆర్థిక స్థితి బాగాలేకపోవడం.. సమ్మె వల్ల జాఫర్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని భార్య మజీరున్నీసా అన్నారు.
ఇదీ చదవండిః తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా..