ETV Bharat / state

తెలంగాణ రాష్ట్ర సమితిలో తలోమాట... - solipeta rama linga reddy

తెరాసలో నేతలంతా తలోమాట మాట్లాడుతున్నారు. మెున్న ఈటల, రసమయి, నాయిని, నారదాసు ఇవాళ సోలిపేట, షకీల్​ ఇలా ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతున్నారు. వీరంతా ప్రతిపక్ష పార్టీలపై వ్యాఖ్యలు చేస్తున్నారనుకుంటే పొరపాటే. సొంత పార్టీ నేతలకే కౌంటర్​ ఇస్తున్నారు.

TRS_MLA'S
author img

By

Published : Sep 14, 2019, 2:26 PM IST

Updated : Sep 14, 2019, 2:46 PM IST

ఇవాళ శాసనసభ ఆవరణలో తెరాస ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, షకీల్​లు మీడియాతో చిట్​చాట్​ జరిపారు. కొందరు తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉదయం ఉగ్రరూపం దాల్చి ... సాయంత్రం చల్లబడడం సరికాదన్నారు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి. వ్యక్తిగత ప్రయోజనాలకోసం పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. తాజ్​మహల్​కు రాళ్లెత్తినోళ్లు ఓనర్లు కారని ఎమ్మెల్సీ నారదాసు అనడం సరికాదని... అలా అనడం శ్రామిక వర్గాన్ని అవమానించడమే అని నారదాసుకు ఫోన్ చేసి చెప్పినట్లు తెలిపారు.

' భాజపా ఎంపీ ఆర్వింద్​ను కలిస్తే తప్పేంటి'

ఇటీవలె భాజపా ఎంపీ అర్వింద్​ను కలిసి తెరాసలో కలకలం సృష్టించిన బోధన్​ ఎమ్మెల్యే షకీల్​ ఇవాళ అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను నిజామాబాద్ జిల్లా భాజపా అధ్యక్షుడిగా పనిచేశానని... తమ ఇంటి పక్కనే ఉండే ఎంపీ అర్వింద్​ను కలిస్తే తప్పేంటని షకీల్​ ప్రశ్నించారు. తాను పార్టీ మారాలనుకుంటే చెప్పే వెళ్తానని... ఎవరికి భయపడనంటూ స్పష్టం చేశారు. గోడ మీద పిల్లి లాగా ఉండనన్నారు. తన మీద ఒక్క కేసు ఉన్నట్టు నిరూపించిన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేస్తానని సవాల్​ విసిరారు. గతంలో తనపై ఉన్న రెండు కేసుల్లో నిర్దోషిగా నిరూపించుకున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 17న ఓ ముస్లిం ఎమ్మెల్యేగా ఏ విధంగా భాజపాలో చేరుతానని వ్యాఖ్యానించారు. చివరగా తాను పార్టీ మారితే బాగుంటుందని తమ వాళ్లే అన్నారని... చెప్పడం కొసమెరుపు.

ఇవీ చూడండి:"ఇప్పుడు నా అక్కర మీకు లేదయ్యా.."

Last Updated : Sep 14, 2019, 2:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.