అసెంబ్లీ సాక్షిగా లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఐదేళ్లు గడిచిన నెరవేర్చకపోవడం దారుణమని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యకుడు కొండల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ కలెక్టరేట్ ఎదుట టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే టీఆర్టీ అభ్యర్థులకు నియామక పత్రాలు అందించాలని, సీపీఎస్ రద్దుచేయాలని, ఉద్యోగులందరికీ తక్షణమే పీఆర్సీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2017లో టీఆర్టీ ఉద్యోగాల కోసం పరీక్షలు నిర్వహించినా, ఇప్పటికి నియామక పత్రాలు అందివ్వకపోవడం దారుణమన్నారు. ఒక్క ఉపాధ్యాయుడు లేని పాఠశాలలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయని అవన్నీ మూతపడే అవకాశం ఉందన్నారు.
ఇవీ చూడండి: విద్యార్థిని ఫొటోతో నోట్‌బుక్స్ పంపిణీ