ETV Bharat / state

దేవాలయాల్లో దొంగతనం.. ఇద్దరి అరెస్టు

దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను మెదక్​ జిల్లా నర్సాపూర్​ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి దేవుళ్ల విగ్రహాలు, కిరీటాలు స్వాధీనం చేసుకున్నారు.

thefts are arrest by medak polices
దేవాలయాల్లో దొంగతనం.. ఇద్దరి అరెస్టు
author img

By

Published : Jan 9, 2020, 12:09 PM IST

మెదక్ జిల్లా నర్సాపూర్ సర్కిల్ పరిధిలో గత రెండు నెలల కాలంలో నర్సాపూర్ కౌడిపల్లి మండలంలోని పలు దేవాలయాల్లో దొంగతనాలు జరిగాయి. ఈ చోరీలను సవాలుగా తీసుకుని నర్సాపూర్ పోలీసులు ఇద్దరు దొంగలను పట్టుకున్నారు. నర్సాపూర్ సమీపంలోని మల్లన్న దేవాలయం వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా వడ్డే కుమార్, గొల్ల నరసింహులు అనే వ్యక్తులు అనుమానస్పదంగా సంచరిస్తుండగా వారిని అదుపులోకి తీసుకుని విచారించగా దేవాలయాల్లో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు.

వారి వద్ద నుంచి వెండి, ఇత్తడి, దేవుళ్ల కిరీటాలతో పాటు దొంగతనానికి పాల్పడిన పనిముట్లను, స్కూటర్​ను స్వాధీనం చేసుకున్నట్లు నర్సాపూర్ సర్కిల్ ఇన్​స్పెక్టర్ నాగయ్య, ఎస్సై సత్యనారాయణ తెలిపారు. అయితే వడ్డే కుమార్ సంగారెడ్డి మండలం సుల్తాన్​పూర్ గ్రామానికి చెందిన వాడని ఇతను గతంలో ఐదుసార్లు దొంగతనం కేసులో జైలుకు వెళ్లి వచ్చాడని అతనితోపాటు మరో వ్యక్తి వడ్డే యాదయ్య పరారీలో ఉన్నారని తెలిపారు.

దేవాలయాల్లో దొంగతనం.. ఇద్దరి అరెస్టు

ఇదీ చూడండి : 'మొక్కలు ఎండితే... పదవులు పోతాయి'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.