ETV Bharat / state

'తెరాస అభ్యర్థులను భారీ ఆధిక్యంతో గెలిపించాలి' - MLA PADMA DEVENDHAR REDDY

రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయన్నారు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి . స్థానిక సంస్థల ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

స్థానిక సంస్థల్లో తెరాస అభ్యర్థులను గెలిపించాలి : పద్మా దేవేందర్ రెడ్డి
author img

By

Published : May 4, 2019, 12:09 AM IST

మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల తరపున ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. జడ్పీటీసీ అభ్యర్థి షర్మిల శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ విష్ణువర్ధన్ రెడ్డి తరపున పాపన్నపేట మండలంలోని పోడ్​ఛాన్​పల్లి, కొండపాక, నాగసాన్ పల్లి, ఎల్లాపూర్ తదితర గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ చేపట్టిన పథకాల వల్ల రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తోందన్నారు. పార్లమెంట్​ ఫలితాల్లో మంచి మెజార్టీ వచ్చే అవకాశం ఉందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో సైతం తెరాస అభ్యర్థులను భారీ ఆధిక్యంతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న మెదక్ ఎమ్మెల్యే
ఇవీ చూడండి : "హైదరాబాద్​లో అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు"

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.