ETV Bharat / state

'సమస్యలు పరిష్కరించాలి.. పీఆర్సీ ఇవ్వాలి' - Telangana Region Teachers Association latest news

ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డిమాండ్​ చేసింది. పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని కోరింది. నర్సాపూర్‌ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేసింది.

Teachers' Union petition to Narsapur Tehsildar
నర్సాపూర్‌ తహసీల్దార్‌కు ఉపాధ్యాయ సంఘం వినతి పత్రం
author img

By

Published : Jan 6, 2021, 9:46 PM IST

ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మెదక్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లం డిమాండ్​ చేశారు. పాత పింఛను విధానం అమలుచేయాలని స్పష్టం చేశారు. నర్సాపూర్‌ తహసీల్దార్‌ మాలతికి వినతి పత్రం అందజేశారు.

సమానంగా..

నర్సాపూర్‌లో క్యాలెండర్​ ఆవిష్కరించారు. అన్ని విభాగాల్లో పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని కోరారు. కస్తూర్బా పాఠశాలల్లో పనిచేసే వారికి రెగ్యులర్‌ ఉపాధ్యాయులతో సమానంగా సెలవులివ్వాలని కోరారు. ఆదర్శ పాఠశాలల్లోని వాళ్లకు మెడికల్‌ రీఎంబర్స్‌మెంట్​ సౌకర్యం కల్పించాలన్నారు.

మార్కెట్‌ ధరకు అనుగుణంగా పీఆర్సీ ఇవ్వాలి. ప్రభుత్వం మూడు ఏళ్లుగా కాలయాపన చేస్తోంది. ఉపాధ్యాయుల పక్షాన రాజీలేని పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించని పక్షంలో.. ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకమై పోరాటం చేస్తాం.

-ఎల్లం, జిల్లా ప్రధాన కార్యదర్శి

కార్యక్రమంలో పీజీహెచ్ఎమ్​ వేణు మాధవ శర్మ, జిల్లా కార్యదర్శి విజయ్ కుమార్, మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: పీఆర్సీని వెంటనే అమలు చేయాలి : టీపీయూఎస్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.