మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలో గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మిర్జాపల్లి రహదారి పక్కన ఒక స్టీల్ కంపెనీ దగ్గర ఉన్న వర్కర్స్ కాలనీలోని ఓ ఇంట్లో గంజాయి వ్యాపారం చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. 90 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ సీఐ కృష్ణయ్య తెలిపారు.
వీటి విలువ 10 వేల వరకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి రామాయంపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. గంజాయి వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.