నియంత్రిత వ్యవసాయం సాగుకోసం ప్రతి రైతు కృషి చేయాలని మెదక్ వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ అన్నారు. రాజ్ పల్లి గ్రామంలో నిర్వహించిన వ్యవసాయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. సమగ్ర వ్యవసాయ విధానం ప్రతి రైతు ఆచరించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు.. రాజ్ పల్లి గ్రామంలో రైతులు ఈ వర్షాకాలంలో మొక్కజొన్న పంటను వేయకూడదని తీర్మానించారు.
మొక్కజొన్నకు బదులుగా... కంది, పత్తి, మినుములు
గ్రామంలోని భూములు.. సన్నరకం వరి పంటలకు అనుకూలమని ప్రవీణ్ కుమార్ తెలిపారు. మొక్కజొన్న పంటకు బదులుగా కంది, పత్తి, మినుములు ఇతర పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. ఈ వర్షాకాలంలో రైతులు మొక్కజొన్న పంట జోలికిపోకుండా ఉండాలని.. ఎవరైనా సాగు చేపడితే రైతుబంధు సాయం రాదని స్పష్టం చేశారు. దానికి బదులు మినుము, పెసర ఇతర పంటలు వేసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: 'రైతుకు లాభం కోసమే.. నియంత్రిత సాగు'