మారని పంథా :
తల్లిదండ్రులు వంట గది, స్టోర్ రూమ్‌లను పరిశీలించారు. రవ్వ, ఆవాలు, జీలకర్ర మొత్తం పురుగు పట్టి ఉండటం చూసి ఆగ్రహం చెందారు. తమ పిల్లలకు ఇటువంటి ఆహారం అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నిర్లక్ష్య ధోరణి
కుళ్లిపోయిన కూరగాయలతో వారి ముందే వంట చేయడానికి ప్రయత్నించగా బాలికల తల్లిదండ్రులు అడ్డుకున్నారు. పాఠశాల ప్రిన్సిపల్‌తో మాట్లాడితే.. ఉంటే ఉంచండి లేకపోతే తీసుకెళ్లండి అని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన చెందారు. పరీక్షలున్నాయని తమ పిల్లలను పాఠశాలకు తీసుకొస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళనకు దిగారు.
ఇవీ చూడండి:దివ్యాంగులకు ఓటరు అవగాహన కార్యక్రమం