తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర బాధ్యుడు కుంతియా ఆరోపించారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో జరిగిన పురపాలక ఎన్నికల సన్నాహక సభకు ఆయన హాజరయ్యారు. ఎంఐఎం, భాజపా సభలకు అనుమతిచ్చి, కాంగ్రెస్ సమావేశాలకు మాత్రం అవకాశం ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వానికి తెరాస ప్రజాప్రతినిధులు మద్దతిస్తూ బయట మాత్రం విమర్శలు చేస్తూ నాటకాలు అడుతున్నారని విమర్శించారు. ప్రజల అభిప్రాయాల్ని గౌరవించకుండా కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చిందని మండిపడ్డారు.
ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం రూ. 3లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా తయారు చేసిందని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. మెదక్ జిల్లాలోని తూప్రాన్, మెదక్, నర్సాపూర్, రామాయంపేట పురపాలికల విజయం కోసం కార్యకర్తలు కృషిచేయాలని సూచించారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమకుమార్, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీచూడండి: ఉత్తమ్ వ్యాఖ్యలను తప్పుపట్టిన ఐపీఎస్‌ల సంఘం