అసలే కరోనా సమయం, వేసవికాలం... గ్రామాల్లో పనులు లేక ప్రజలు, యువకులు పాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పనులు కల్పించాలని కోరుతూ శీలంపల్లి గ్రామస్థులు.. మెదక్ జిల్లా చిలపచేడ్ మండలంలో ధర్నా చేశారు. నర్సాపూర్- జోగిపేట రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి.. రాకపోకలకు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
విషయం తెలుసుకున్న ఎస్సై మల్లారెడ్డి అక్కడికి చేరుకుని గ్రామస్థులకు నచ్చజెప్పారు. తమకు పనులు కల్పించాలని కోరారు. రెండ్రోజుల్లో పనులు కల్పించే ఏర్పాట్లు చేస్తామని ఎస్సై హామీ ఇచ్చారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అధికారుల నిర్లక్ష్యం.. కుమ్మరికుంట అన్యాక్రాంతం