సీఎల్పీని తెరాసలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ మెదక్ పట్టణంలో కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించింది. జిల్లా పార్టీ కార్యాలయం నుంచి రాందాస్ చౌరస్తా వరకు డీసీసీ అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం కలగగా పోలీసులు ఆందోళన విరమింపచేశారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతిరెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పాలనాధికారి ధర్మారెడ్డికి విలీన ప్రక్రియను వ్యతిరేకిస్తూ వినతి పత్రం సమర్పించారు.
సీఎం కేసీఆర్ పాలనను గాలికి వదిలేసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు విమర్శించారు. కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని తెరాసలో విలీనం చేయడం సముద్రాన్ని, పిల్ల కాలువలో కలిపినట్లుగా అభివర్ణించారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి సోమన్న గారి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : పురుగుల మందు తాగిన ముగ్గురు చిన్నారులు