కూరగాయలు, పందిరి కూరగాయల, పండ్ల తోటల పెంపకంపై అవగాహన పెంపొందించుకొని అధిక దిగుబడి సాధించాలని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ సూచించారు. కూరగాయలు, పండ్ల తోటల పెంపకంపై అవగాహన కల్పించేందుకు... సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం కింద.. సిద్దిపేట జిల్లా ములుగులోని ఉద్యాన హబ్‌కు విజ్ఞాన యాత్ర బస్సును కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
కూరగాయల పెంపకం, నారుమడుల పెంపకంపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించుటకు ఈ విజ్ఞాన యాత్ర చేస్తున్నామని తెలిపారు. 42ఎస్సీ, 13 మంది ఎస్టీ లబ్ధిదారులకు ములుగులో ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో ఉద్యాన శాస్త్రవేత్తలు, ఉద్యాన అధికారులు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. ఉద్యాన హబ్‌లో సాగు చేస్తున్న పంటలను ప్రత్యక్షంగా చూపిస్తారన్నారు.
ఇదీ చూడండి: చిన్న వయసు.. పెద్ద గుర్తింపు!