గ్రామాలలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి రెండో విడత పల్లెప్రగతి కార్యక్రమం చేపట్టడం జరిగిందని పల్లెప్రగతి కార్యక్రమ రాష్ట్ర పరిశీలకులు సందీప్ కుమార్ తెలిపారు. మెదక్ జిల్లా చిలప్‌చెడ్ మండలంలోని శీలాంపల్లి, ఫైజాబాద్, అంతారం గ్రామాలలో ఆయన పర్యటించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భాగసామ్యంతో ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. గతంలో పల్లెప్రగతిలో చేపట్టిన పనులను పరిశీలించి.. గ్రామాల్లో స్వచ్ఛత చాలా మెరుగపడిందన్నారు. పల్లెప్రగతి, హరితహారంలో నాటిన మొక్కలను సంరంక్షించాలని సూచించారు.
తడి పొడి చెత్తను వేరుచేసే కేంద్రాలను తొందరగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటే గ్రామాల్లో ఎంతో అభివృద్ధి జరుగుతుందన్నారు.
ఇదీ చూడండి : బీర్ కేక్ ఎప్పుడైనా తిన్నారా?