ETV Bharat / state

భార్యతో మాట్లాడిన స్నేహితుణ్ని అనుమానంతో చంపేశాడు

భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడనే అనుమానంతో స్నేహితుడినే చంపేశాడు ఓ వ్యక్తి. ఈ దారుణ ఘటన మెదక్​ జిల్లా ఏడుపాయలలో చోటుచేసుకుంది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నారు.

author img

By

Published : Nov 22, 2019, 8:09 PM IST

అనుమానంతో స్నేహితుడినే చంపాడు...

తన భార్యతో చనువుగా ఉంటున్నాడనే అనుమానంతో స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన ఘటన ఈ నెల 19న మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయలలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం కిష్టారెడ్డిపేట గ్రామానికి చెందిన దొంతి నారాయణను అదే గ్రామానికి చెందిన కొలను రామకృష్ణ, బీరంగూడ గ్రామానికి చెందిన కొమ్ము ప్రసాద్​లు కలిసి చంపారు. ఆయుధంతో పొడిచి బండరాయితో మోది శవాన్ని గుర్తుపట్టకుండా యాసిడ్ పోశారని మెదక్​ డీఎస్పీ కృష్ణమూర్తి తెలిపారు.

దొంతి నారాయణ తన అవసరాల నిమిత్తం తన స్నేహితుడు కొలను రామకృష్ణ వద్ద డబ్బులు తీసుకుంటూ మళ్లీ ఇచ్చేవాడు. ఇదే క్రమంలో ఈనెల 11న పదివేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. తిరిగి ఇచ్చేందుకు నారాయణ అప్పిచ్చిన తన మిత్రుడు రామకృష్ణ ఇంటికి వచ్చాడు. తన భార్యతో నారాయణ మాట్లాడుతుండటం రామకృష్ణకు అనుమానం తెప్పించింది.

ఈ నేపథ్యంలో బీరంగూడ గ్రామానికి చెందిన మరో మిత్రుడు కొమ్ము ప్రసాద్​కు ఈ విషయాన్ని తెలిపాడు. నారాయణను హతమార్చాలని ఇద్దరు పథకం పన్నారు. ఏడుపాయలకు తీసుకువచ్చి అతిగా మద్యం సేవించి నారాయణ గొంతుకోసి యాసిడ్ పోసి పారిపోయారని డీఎస్పీ వెల్లడించారు. హత్యకు పాల్పడిన నిందితులను పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి 48గంటల్లో పట్టుకున్నారు. త్వరలో ఏడుపాయల్లో నేరాలను నిరోధించేందుకు పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ కృష్ణమూర్తి తెలిపారు.

అనుమానంతో స్నేహితుడినే చంపాడు...

ఇవీ చూడండి: ఏఎస్సై ఆత్మహత్యాయత్నం.. వేధింపులే కారణమా!?

Intro:TG_SRD_42_22_CRIME_AVB_TS10115...
రిపోర్టర్.శేఖర్.
మెదక్..9000302217..
తన భార్యతో చనువుగా ఉంటున్నాడు అన్న అనుమానంతో స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన ఈ నెల 19న మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల్లో చోటుచేసుకుంది....
హత్య గల కారణాలను మెదక్ డిఎస్పీ కృష్ణమూర్తి విలేకర్ల సమావేశంలో వెల్లడించారు..
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం కిష్టారెడ్డి పేట గ్రామానికి చెందిన దొంతి నారాయణను అదే గ్రామానికి చెందిన కొలను రామకృష్ణ, బీరంగూడ గ్రామానికి చెందిన కొమ్ము ప్రసాద్ లు,కలిసి ఆయుధంతో కోసి బండరాయితో మోది శవాన్ని గుర్తుపట్టకుండా యాసిడ్ పోశారు అని తెలిపారు..
దొంతి నారాయణ తన అవసరాల నిమిత్తం తన స్నేహితుడు కొలను రామకృష్ణ వద్ద డబ్బులు తీసుకుంటూ ఇచ్చేవాడు ఇదే క్రమంలో ఈనెల 11న అప్పుగా తీసుకున్న పదివేల రూపాయల విషయంలో మృతుడు నారాయణ రామకృష్ణ ఇంటికి వస్తు ఆయన భార్యతో మాట్లాడుతుండటం వల్ల రామకృష్ణకు అనుమానం కలిగింది.. ..
ఈ నేపథ్యంలో బీరంగూడ గ్రామానికి చెందిన మరో మిత్రుడు కొమ్ము ప్రసాద్ తో కలిసి ఈ విషయాన్ని తెలిపారు నారాయణను హతమార్చాలని పథకం ప్రకారం ఏడుపాయల కు తీసుకువచ్చి అతిగా మద్యం సేవించి అతని తలమీద కత్తితో గొంతుకోసి యాసిడ్ పోసిపారి పోవడం జరిగింది
హత్యకు పాల్పడిన నిందితులను పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి 48గంటల్లో చేదించడంతో మెదక్ రూరల్. సీఐ రాజశేఖర్ , పాపన్నపేట ఎస్ఐ ఆంజనేయులు ,
హవేలీ ఘనపూర్ ఎస్సై శ్రీకాంత్ ,ఐడి పార్టీ కానిస్టేబుల్ తాహెర్ ను, డీఎస్పీ కృష్ణమూర్తి అభినందించారు...

త్వరలో ఏడుపాయల్లో నేరాలను నిరోధించేందుకు పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు చేస్తున్నట్లు డిఎస్పి కృష్ణమూర్తి తెలిపారు ఏడుపాయల్లో సీసీ కెమెరాలు కూడా ఉన్నాయని అదనపు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు...

బైట్.. కృష్ణమూర్తి.. మెదక్ డి.ఎస్.పి

దీపావళి రోజు గుర్తుతెలియని మహిళ మృతదేహని కి సంబంధించి నిందితులను త్వరలో పట్టుకుంటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు

హత్య గల కారణాలను మెదక్ డిఎస్పీ కృష్ణమూర్తి

Body:విజువల్

Conclusion:ఎన్ శేఖర్.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.