ETV Bharat / state

సటసట అడుగులు... చిటచిట ఆకలి! - వలస కార్మికులు ఆవస్థలు

నిన్న మొన్నటి వరకు నిత్యం వందలాది వాహనాలు, ప్రయాణికులతో కళకళలాడిన జాతీయ రహదారి ఇది. ఉదయం నుంచి రాత్రి వరకు ఈ మార్గంలో వెళ్లేవారు కడుపు నింపుకునేందుకు ఓ భరోసా ఉండేది. కరోనా పుణ్యమా... అని అన్నీ ఆవిరయ్యాయి. రామాయంపేటలోని ఈ రహదారి తనను ఆసరాగా చేసుకుని వేల మైళ్ల దూరం కాలినడకన వెళుతున్న వారి బాధను చూసి తట్టుకోలేక పోతోంది. అక్కడక్కడా కొందరు వారి ఆకలి బాధను తీరుస్తున్నా.. స్వగ్రామాలకు చేరుకోవడానికి నానా అవస్థలు పడుతూ బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

people-walk-on-national-highways-in-medak-district-due-to-lock-down-effect
సటసట అడుగులు... చిటచిట ఆకలి!
author img

By

Published : Mar 30, 2020, 12:03 PM IST

కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఉన్న 44వ జాతీయ రహదారి మెదక్​ జిల్లాలో తూప్రాన్‌ నుంచి రామాయంపేట వరకు 56 కిలోమీటర్ల వరకు ఉంది. ఈ మార్గంలో జిల్లా పరిధిలో సుమారు 25 వరకు దాబాలు ఉన్నాయి. మరోవైపు సంగారెడ్డి, నాందేడ్‌, అకోలా జాతీయ రహదారి 28 కిమీటర్లు ఉండగా, జిల్లాలో సుమారు 5 వరకు దాబాలు ఉన్నాయి. దేశ ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు ఈ నెల 22న జనతా కర్ఫ్యూ ప్రకటించగా అంతా ఇళ్లకే పరిమితమై సహకరించి విజయవంతం చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతటితో సరిపెట్టక పరిస్థితి చేయిదాటక ముందే కరోనా వైరస్‌ నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యావసర దుకాణాలు మినహా అన్నింటినీ మూసివేశారు. ఈ నేపథ్యంలో జాతీయ రహదారిపై ఉన్న హోటళ్లు, దాబాలు సైతం మూతపడ్డాయి.

ప్రతిరోజూ 500 మంది..

లాక్‌డౌన్‌ నేపథ్యంలో దుకాణాలు, ఇతర చిన్నా చితక కంపెనీల్లో పనిచేసే వేలాది కార్మికులు రోడ్డున పడ్డారు. వాళ్లు నివాసం ఉండే అద్దె గృహాల యజమానులు, పనిలో పెట్టుకున్న వారు వారి బాగోగులు చూడక పోవడంతో పొట్టకూటికి రాష్ట్రాలు దాటి వచ్చిన వారు సొంతూళ్లకు పయనమయ్యారు. వెళ్లేందుకు ప్రజా రవాణా లేకపోవడంతో వందల కిలోమీటర్లు కాలినడకనే వెళుతున్నారు. ఇలా 44వ జాతీయ రహదారిపై గడచిన ఐదు రోజులుగా ప్రతి రోజూ కనీసం 500 మంది వరకు వెళుతున్నారు.

స్వగ్రామాలు దూరంగా ఉన్నా గత్యంతరం లేని పరిస్థితుల్లో చిన్న పిల్లలతో కలిసి సాగుతున్నారు. కాలినడకన వెళ్లలేని వారు ట్రక్కులను ఆశ్రయిస్తుండగా గాలి సైతం చొరబడని రీతిలో బిక్కుబిక్కుమంటూ వెళుతున్నారు. ఈ క్రమంలో వెళ్లే దారిలో ఎక్కడా ఆహారం దొరక్కొ ఖాళీ కడుపుతో ఉండలేక నీళ్లతో కడుపు నింపుకుంటున్నారు.

people-walk-on-national-highways-in-medak-district-due-to-lock-down-effect
ట్రక్కులో తరలి వెళుతున్న కార్మికులు

చేతనైన సాయం

రహదారిపై వెళ్లేవారికి ఆయా గ్రామాల ప్రజలు నాయకులు చేతనైన సాయం చేస్తున్నారు. రామాయంపేటలో ఛైర్మన్‌ జితేందర్‌ గౌడ్‌తో పాటు ఆయన స్నేహితుడు రాజు సుమారు వంద తాగునీటి ప్యాకెట్లు అందజేయడానికి ఏర్పాట్లు చేశారు. మరోవైపు శనివారం రహదారిపై వెళ్లే వంద మందికి 200 యాపిళ్లు అందజేశారు. తూప్రాన్‌లో ఓ దాబా నిర్వాహకుడు సత్తిరెడ్డి 50 శీతల పానీయాలు అందజేశారు. చేగుంట పరిధిలో ఓ దాబా నిర్వాహకుడు హరిజిత్‌సింగ్‌ సుమారు 200 మందికి ఆహార పొట్లాలు ఇచ్చారు. చేగుంటకు చెందిన వాయిస్‌ ఆఫ్‌ యూత్‌ సభ్యులు వంద మందికి ఆహార పొట్లాలు ఇచ్చి ఆదుకున్నారు. వారికితోడు ఆదివారం నుంచి ప్రభుత్వం సైతం భోజన ఏర్పాట్లు చేసింది.

ఇదీ చూడండి: రాష్ట్రంలో నేడు అక్కడక్కడ వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.