ETV Bharat / state

పంతులు రాలేదు కానీ... వేదమంత్రోశ్ఛరణల మధ్యే పెళ్లి జరిగింది - మొబైల్​ పెళ్లి

వధూవరులు మండపంలో ఉన్నారు. పంతులు మాత్రం లేడు. మంత్రాలు మాత్రం వినబడుతూనే ఉన్నాయి. అందేటీ అని తీక్షణంగా చూస్తే... ఆ పంతులు ఆన్​లైన్​లో ఉన్నాడని అర్థమైంది. కరోనా భయంలో ఓ పంతులు మొబైల్​ ద్వారానే పెళ్లి తతంగం కానిచ్చేశాడు. చరవాణీలో నుంచే కొత్తజంటకు ఆశీర్వాదాలిచ్చేశాడు.

online marriage in ambriya thanda
online marriage in ambriya thanda
author img

By

Published : May 5, 2021, 5:10 PM IST

పంతులు రాలేదు కానీ... వేదమంత్రోశ్ఛరణల మధ్యే పెళ్లి జరిగింది

సెల్​ఫోన్​లో పురోహితుడు వేదమంత్రాలు చదువగా... వధూవరులు ఒక్కటైన సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. పాపన్నపేట మండలం అంబ్రియా పంచాయతీ పరిధి సొమ్ల తండాకు చెందిన బానోత్ శివరాం కూతురు మంజులకు... టేక్మాల్ మండలం భీమ్లా తండాకు చెందిన పాత్లోథ్ మోహన్​తో వివాహం నిశ్చయమైంది. పెళ్లి సోమవారం జరగాల్సి ఉండగా... అంతకు ముందు రోజున వధువు తండాలో ఓ యువకుడు కరోనాతో మృతి చెందాడు.

తండాకు వెళ్లి పెళ్లి చేసేందుకు భయపడిన పురోహితుడు... తన నివాసం నుంచే పెళ్లి జరిపించాడు. వీడియో కాల్​లో పంతులు వేద మంత్రాలు చదువగా... మొబైల్​ను మైకు వద్ద పెట్టి అందరికీ వినిపించేలా చేశారు. చరవాణీలో చూస్తూ... పురోహితుడు చెప్పిన విధంగా ఆ నూతన వధూవరులు చేశారు. మొత్తానికి మొబైల్​ వీడియో కాల్​తో... పెళ్లి తంతు ముగించారు. ఒక్కటైన కొత్త జంటను ఆన్​లైన్​లోనే ఆశీర్వాదించాడు ఆ పురోహితుడు. ఇప్పుడు ఈ పెళ్లి విషయం... జిల్లా అంతటా "ఆన్​లైన్​ పెళ్లి" పేరిట వైరల్​ అవుతోంది.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి: సీఎస్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.