ETV Bharat / state

మెదక్​ చర్చిని ఎందుకు నిర్మించారో తెలుసా..? - మెదక్​లో క్రిస్మస్ వేడుకలు

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న మెదక్ చర్చి ఆసియాలో రెండో అతిపెద్ద చర్చిగా గుర్తింపు పొంది.. చారిత్రాత్మక వారసత్వ సంపదకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఎల్లప్పుడూ దైవ ప్రార్థనలతో విరాజిల్లే ఈ చర్చిని ఎందుకు నిర్మించారో తెలుసా? ఎవరు కట్టించారో తెలుసా?

one-of-the-largest-church-in-asia-medak-church-history
అందుకే మెదక్​ చర్చిని నిర్మించారు..
author img

By

Published : Dec 23, 2020, 10:54 AM IST

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మెదక్​ ప్రాంతంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లాలో వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న కాలంలో కరువు విలయతాండవం చేసింది. ఆ సమయంలో చేసేందుకు పని లేక పేద రైతులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నారు. అప్పుడు వచ్చాడు చార్లెస్ వాకర్ పాస్నెట్​.

చార్లెస్ రాకతో..

ఇంగ్లాండ్​కు చెందిన చార్లెస్ వాకర్ పాస్నెట్​ సువార్త సేవలు అందించాలనే ఉద్దేశంతో 1895లో ఇండియాకు వచ్చాడు. కొన్నాళ్లు మద్రాస్​లో బోధనలు చేసి... అనంతరం సికింద్రాబాద్​కు వచ్చారు. 1897లో మెదక్ టౌన్​లో దాదాపు 150 ఏళ్ల కిందట బెర్లిన్ దొర నిర్మించిన చిన్న చాపేల్ చర్చి ప్రచారకుడిగా బదిలీ అయ్యాడు. అతను ఉండేందుకుగానూ... పాస్నెట్ అత్తామామలు మెదక్ మిషన్ కాంపౌండ్​లో రెండు అంతస్తుల భవనం నిర్మించి ఇచ్చారు.

బ్రాడ్​ షా నమూనాతో..

చర్చి చిన్నగా ఉండి... తన భవనం పెద్ద ఉండడంతో పాస్నెట్ చర్చిని తన ఉండే భవనం కంటే ఎత్తులో ఉండాలని నిర్ణయించుకున్నాడు. తన మిత్రుడైన బ్రాడ్​ షాతో చర్చించి 200 మోడల్స్​ గీయించి... ప్రస్తుతం చర్చి ఉన్న నమూనాను ఎంపిక చేశాడు. కరువు కాలంలో 1914లో ప్రారంభమైన చర్చి నిర్మాణ పనులు... దాదాపు పదేళ్లు కొనసాగాయి. 173 అడుగులు ఎత్తు, 100 అడుగుల వెడల్పు, 200 అడుగుల పొడవుతో యూరప్ గోతిక్ శైలిలో అత్యంత సుందరంగా దీనిని నిర్మించారు. చెకోస్లోవేకియా దేశస్థులు దేవదారు కర్రతో తయారు చేసిన బైబిల్ పటాన్ వేదిక, రాంగ్గున్ టేకుతో రూపొందించిన ప్రభు భోజనం బల్ల, రోజ్​వుడ్​తో తయారుచేసిన కుర్చీలు, టేబుల్​, దర్వాజాలు చూపరులను ఆకట్టుకుంటాయి.

అదే ప్రత్యేకత..

లండన్​కు చెందిన కళాకారుడు సాలిస్... చర్చిలో ఎత్తైన విండోస్​పై చిన్న చిన్న రంగురంగుల స్టెయిన్లెస్ గ్లాస్ ముక్కలు ఫిక్స్ చేసి... ఏసుక్రీస్తు జీవితంలోని ప్రధాన ఘట్టాలను కళ్లకు కట్టినట్టు రూపొందించటం విశేషం. బయట నుంచి సూర్యకాంతి పడినప్పుడు మాత్రమే ఈ విండోస్​పై ఉన్న దృశ్యాలు స్పష్టంగా కనిపించడం వీటి ప్రత్యేకత.

కడుపు నింపింది..

తీవ్రమైన కరువు దుర్భిక్ష పరిస్థితులు నెలకొని ఆకలి చావులు సంభవిస్తున్న సమయంలో... ఈ చర్చి నిర్మాణం పదేళ్లపాటు జిల్లా చుట్టుపక్కల ఉన్న వేలాది మంది పేదలకు ఉపాధి కల్పించింది.

ముస్తాబవుతోంది..

1947లో సీఎస్ఐ ఆవిర్భవించి డయాసిస్ కేంద్రంగా మారింది. బిషప్​ నియామకం కావడంతో మెదక్ చర్చి కేథడ్రల్ అయ్యింది. రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్​లు దీని పరిధిలోనే ఉన్నాయి. ప్రస్తుతం మెదక్ డయాసిస్ బిషప్​గా రెవరెండ్ ఏసీ సాల్మన్ రాజు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో కరోనా నిబంధనలు పాటిస్తూ... అంగరంగ వైభవంగా క్రిస్మస్ వేడుకలకు చర్చి ముస్తాబవుతోంది. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటారు.

శాలరీస్ వాకర్ పాస్నెట్ మదిలో మెదిలిన ఆలోచన. ఇంజినీర్ బ్రాడ్ షా రూపొందించిన నమూనా. థామస్ ఎడ్వర్డ్ వాస్తు నైపుణ్యం. ఇంగ్లాండు ఇటలీ దేశాల ఆర్కిటెక్చర్​ల అద్భుత పనితనం. వీరందరి అద్భుతమైన సృష్టి మెదక్ చర్చి. అందుకే ఈ కట్టడాన్ని సందర్శించుకునేందుకు నిత్యం ప్రజలు వస్తూనే ఉంటారు.

ఇదీ చూడండి: 'ప్లాస్టిక్​ బబుల్​'లో శాంటాక్లాస్ సందడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.