ETV Bharat / state

పాములు పట్టేవాడే... పాము కాటుతో మృతి - పాములు పట్టేవాడే... పాము కాటుతో మృతి

మెదక్​ జిల్లా నర్సాపూర్​లో ఉచితంగా పాములను పట్టి ఎంతోమందికి సేవలందించిన మహ్మద్‌ బషీరుద్దిన్‌ పాము కాటుతోనే మృతి చెందాడు.

snake
పాములు పట్టేవాడే... పాము కాటుతో మృతి
author img

By

Published : Dec 1, 2019, 12:14 PM IST

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ పట్టనానికి చెందిన మహ్మద్‌ బషీరుద్దిన్‌ కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. అలాగే తనకు పాములో పట్టడంలో పట్టు ఉంది. ఎక్కడైనా పాము వచ్చిదని సమాచారం వస్తే వెంటనే వెళ్లి పామును పట్టి దూరంగా వదిలి వచ్చేవాడు. ఇందుకు ఎలాంటి డబ్బులు తీసుకునేవాడు కాదు. ఉచితంగానే సైకిల్‌పై వచ్చి సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందేవాడు. పాములను చంపొద్దని అవీ మనలాంటి జీవులేనని చెబుతూ ఉండేవాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో పట్టణంలోని ఒక ఇంట్లో పాము వచ్చిందని తెలిసి అక్కడికి వెళ్లాడు. నాగుపామును పడుతున్న క్రమంలో అది బషీరుద్దిన్​ను కరిచింది. అయినా దానిని పట్టుకుని డబ్బాలో బంధించాడు. అనంతరం పామును తీసుకుని వెళ్తుండగా... ఒక్కసారిగా కిందపడిపోయాడు. విషయం గమనించిన కుటుంబసబ్యులు వెంటనే బషీరుద్దిన్​ను నర్సాపూర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మద్యాహ్నం బషీరుద్దిన్​ మృతి చెందాడు. మృతునికి భార్య అబేదా నలుగురు పిల్లలు ఉన్నారు.

పాములు పట్టేవాడే... పాము కాటుతో మృతి

ఇవీ చూడండి: పరామర్శలు వద్దు న్యాయం కావాలి...

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.