ETV Bharat / state

యూసఫ్​ పేటలో కరోనాతో వ్యక్తి మృతి - మెదక్​లో కొవిడ్​తో వ్యక్తి మృతి

పాపన్నపేట మండల పరిధి యూసుఫ్ పేటలో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన (35) వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

covid death, corona in medak
covid, medak covid
author img

By

Published : Apr 2, 2021, 2:25 PM IST

మెదక్​ జిల్లా పాపన్నపేట మండలం యూసుఫ్​ పేటలో కరోనా కలకలం రేగింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొవిడ్​తో మృత్యువాతపడ్డాడు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొన్నాళ్లుగా హైదరాబాద్​లో ఉంటున్నాడు. మూడురోజుల క్రితం గ్రామానికొచ్చాడు. ఊరిలో విందులో పాల్గొన్నాడు. తర్వాత రోజు తీవ్ర అస్వస్థతకు గురవ్వడం వల్ల మెదక్​ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. కొవిడ్​ సోకినట్లు పరీక్షల్లో తేలింది. పరిస్థితి విషమించడం వల్ల వెంటనే గాంధీకి తరలించారు.

రెండు రోజులుగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతని భార్యకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్​ వచ్చింది. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్​లో ఉంది. విందులో పాల్గొన్న అందరికీ కొవిడ్​ పరీక్షలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్న గ‌వ‌ర్న‌ర్ తమిళిసై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.