ETV Bharat / state

సాధారణం వద్దు... చిరుధాన్యం ముద్దు.... - SCIENTIST

రోజూ తీసుకునే ఆహారానికి భిన్నంగా చిరుధాన్యాలు తీసుకోవడం ద్వారా మరింత ఆరోగ్యంగా ఉండవచ్చని అంటున్నారు స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార ఆరోగ్య నిపుణులు ఖాదర్​వలి.

సాధారణం వద్దు...చిరుధాన్యం ముద్దు....
author img

By

Published : Jul 2, 2019, 8:31 PM IST

చిరుధాన్యాలతోనే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార ఆరోగ్య నిపుణులు ఖాదర్‌ వలి అన్నారు. సోమవారం మెదక్‌ పట్టణంలోని వైస్రాయ్‌ గార్డెన్స్‌లో ఏకలవ్య ఫౌండేషన్‌, కృషి విజ్ఞాన కేంద్రం (తునికి), వ్యవసాయ శాఖ మెదక్‌ జిల్లా సంయుక్తంగా నిర్వహించిన ‘సిరి ధాన్యాలతో ఆహార ఆరోగ్యం’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. రోజురోజుకు మానవుడి ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారుతోందని, మంచి ఆహార అలవాట్లే ఆరోగ్యానికి సోపానమని తెలిపారు. మానవ జీవన విధానంలో వచ్చిన మార్పులతో చిన్నారులతో సహా అంతా అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. వీటికి చిరుధాన్యాలతోనే పరిష్కారం లభిస్తుందని, వాటిని పండించడంపై రైతులు దృష్టి సారించాలన్నారు.

కొర్రలు, అరికెలు, సామలు, ఆండుకొర్రల సాగుకు నీరు పెద్దగా అవసరం ఉండదని అన్నారు. వరి, గోధుమల ఆహారాన్ని తినడం తగ్గించి చిరుధాన్యాల ఆహారం తింటే రోగాల బారిన పడకుండా ఉంటారన్నారు. సదస్సులో ఇఫ్​కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, ఏకలవ్య ఫౌండేషన్‌, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్యాంసుందర్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి పరశురాం నాయక్‌, మెదక్‌ పురపాలక సంఘం ఉపాధ్యక్షులు రాగి అశోక్‌, మండల వ్యవసాయ అధికారి రెబల్‌సన్‌, వివిధ మండలాల వ్యవసాయ అధికారులు, రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: హుస్సేన్ సాగర్​లో జాతీయ సెయిలింగ్ పోటీలు షురూ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.