అంతా రికార్డు అవుతుంది
నామినేషన్ వేయడానికి ఎవరెవరు, ఎప్పుడెప్పుడొచ్చారు. ఏఏ పత్రాలు సమర్పించారు లాంటి అన్ని అంశాలు రికార్డు అవుతాయన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అయితే అభ్యర్థితో పాటు బలపరిచే వ్యక్తి ఒకరు రావాలి. ఇతర పార్టీల వారు, స్వతంత్ర అభ్యర్థులు అయితే బలపరిచే వ్యక్తులు పదిమంది ఉండాలి. వారంతా స్థానిక నియోజకవర్గానికి చెందినవారై ఉండాలన్నారు.
ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సిందే
ఎంపీ అభ్యర్థులు రూ. 70 లక్షల వరకు ఖర్చు చేయవచ్చని తెలిపారు. నామినేషన్ సమయంలోనే అభ్యర్థుల తమ ఆస్తుల వివరాలు, ఐదేళ్లుగా వారి కుటుంబ సభ్యులు ఆదాయపన్ను వివరాలు జతచేయాలన్నారు. నేర చరిత్రకి సంబంధించిన పూర్తి సమాచారం కూడా ఇవ్వాలని సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థుల ఖర్చులకు సంబంధించి మానిటరింగ్ టీం పనిచేస్తాయని ధర్మారెడ్డి తెలిపారు.
ఇవీ చదవండి:గులాబీ అధినేత అదృష్ట సంఖ్య తెలుసా..!