మెదక్ జిల్లాలోని నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ కనుమరుగు కానుంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ అమ్మకానికి ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల 307 మంది ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారబోతోంది. ఈరోజు మెదక్ మండలంలోని మంభోజిపల్లిలో ఉన్న నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్‌పై గురువారం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ విక్రయానికి ఆదేశాలు జారీ చేయడం వల్ల కార్మికులు ఆందోళన చెందుతున్నారు.సీఐటీయూ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ గేటు వద్ద ఈరోజు కార్మికులు ధర్నా చేశారు. మెదక్‌లో ఎన్ఎస్ఎల్ కర్మాగారం ఏర్పాటై వందలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభించింది. చెరుకు రైతులకు చేతినిండా పని లభించింది. కానీ నేడు పరిశ్రమను మూతపడే పరిస్థితికి తీసుకువచ్చారు. మెదక్‌లోని ఎన్ఎస్ఎల్ ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మల్లేశం డిమాండ్ చేశారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు హాజరు కాకుండా నిర్లక్ష్యం చేసిందని అన్నారు.
ఇవీ చూడండి: 'కేసీఆర్ తెలివైన అవినీతి పరుడు'