మెదక్ జిల్లా నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో దారుణం జరిగింది. రాంపూర్ గ్రామంలో ప్రేమ పేరుతో వేధిస్తున్నాడంటూ నర్సింహులు గౌడ్ (32)అనే యువకుడిని అమ్మాయి తరఫు బంధువులు బండరాళ్లతో కొట్టి చంపారు.
కొన ఊపిరితో ఉన్న యువకుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.