ప్రజల సమస్యలను తెలుసుకొని.. వాటిని పరిష్కరించటమే లక్ష్యంగా 'మీకోసం' అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం కోసమే.. కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. మెదక్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిడ మాట్లాడారు.
ప్రతీ నెల 2, 16వ తేదీల్లో ఉదయం 10నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మండల స్థాయిలోని సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా స్థాయి సమస్యలను కలెక్టర్ వరకు, పెద్ద సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వివరించారు.
అంతకుముందు పద్మా.. డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను విన్నారు. వాటిని పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. పోలీసు శాఖ తరఫున 'మీకోసం' కార్యక్రమానికి.. తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మున్సిపల్ ఛైర్మన్, జడ్పీటీసీలు, ఎంపీపీలు సర్పంచులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: విధుల్లో మద్యం సేవించిన ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెండ్