రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని... నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. కేంద్రాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
పంటను సకాలంలో తీసుకువచ్చి మంచి మద్దతు ధర తీసుకోవాలని రైతులకు సూచించారు. అనంతరం శివ్వంపేట, హత్నూర, కౌడిపల్లి మండలాల్లో ధాన్యం కోనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అర్హులకు కల్యాణలక్ష్మీ చెక్కులను పంపిణి చేశారు.
ఇదీ చదవండి: చిన్నారిని కాపాడిన సాహసవీరుడికి సత్కారం