ETV Bharat / state

ధరణితో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది: హరీశ్​రావు - ధరణి హరీశ్​రావు సమీక్ష

ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో సీఎం కేసీఆర్​ ధరణి పోర్టల్​ను​ ఏర్పాటు చేశారని మంత్రి హరీశ్​రావు అన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడిచినా భూతగాదాలు పరిష్కారం కాలేదన్నారు. ధరణితో విప్లవాత్మకమైన మార్పు వచ్చిందని స్పష్టం చేశారు. ఈ మేరకు మెదక్ జిల్లా కేంద్రంలో రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి సమావేశంలో 'ధరణి'పై ప్రసంగించారు.

minister harishrao district level meeting on dharani portal in medak
ధరణితో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది: హరీశ్​రావు
author img

By

Published : Jan 20, 2021, 10:28 PM IST

కలెక్టర్, అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ కేసుల కోసం ట్రిబ్యునల్​ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. ధరణి ఏర్పాటుతో కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు భూముల విషయంలో తలదూర్చే అవకాశం లేదని.. పారదర్శకంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. మెదక్ పట్టణంలోని సాయి బాలాజీ గార్డెన్​లో ధరణిపై రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి సమావేశంలో పాల్గొన్నారు.

స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా భూతగాదాలు పరిష్కారం కాలేదని.. ధరణితో విప్లవాత్మకమైన మార్పు వచ్చిందని హరీశ్​రావు పేర్కొన్నారు. మిగతా రాష్ట్రాలకు ధరణి మార్గదర్శకం అవుతుందన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో సాదాబైనామా కేసులు ఎక్కువగా ఉన్నాయని.. వాటిని పరిష్కరించాలని కలెక్టర్​కు సూచించారు. త్వరలో ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములపైన జాయింట్ సర్వే చేపడతామని తెలిపారు. ధరణి ప్రధాన ఉద్దేశం పనిలో పారదర్శకతతోపాటు భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరళీకృతం చేయడమేనని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు పూర్తి చేయండి : సీఎస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.