ETV Bharat / state

'తూప్రాన్​ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా ఉంచాలి' - minister visit

మెదక్​ జిల్లా తూప్రాన్​ మున్సిపాలిటీలో మంత్రి హరీశ్​రావు పర్యటించారు. తూప్రాన్​ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా ఉంచాలని అధికారులకు సూచించారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు.

minister harish rao visit in toopran municipality

author img

By

Published : Jul 21, 2020, 10:47 PM IST

మెదక్​ జిల్లాలో తూప్రాన్​ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా ఉంచాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు అధికారులకు సూచించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. తూప్రాన్​లో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​ పనులను పరిశీలించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్​ కార్యాలయం, డబుల్​బెడ్​రూమ్​ల నిర్మాణాలను పరిశీలించి... పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకొన్నారు.

మున్సిపల్​ బిల్డింగ్​ పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులకు సూచించారు. మహిళల కాన్ఫరెన్స్​ హాల్​ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు పౌరసేవా కేంద్రం ప్రజలకు ఉపయోగపడేలా చూడాలన్నారు. పనులు జరుగుతున్న తీరును వాట్సాప్​లో ఫొటోలు తీసి ఎప్పటికప్పుడు తనకు పంపించాలన్నారు. పర్యటనలో మంత్రి వెంట మెదక్​ ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి, జిల్లా కలెక్టర్​ ధర్మారెడ్డి, పంచాయతీరాజ్​ ఈఈ వెంకటేశ్వర్లు, గడా ఆఫీసర్​ ముత్యంరెడ్డి, ఆర్డీవో శ్యామ్​ప్రకాశ్​, వంటేరు ప్రతాప్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కరోనా విలయం: కోటి 47 లక్షలు దాటిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.