ఈనెల 25న ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. నర్సాపూర్‌లో ఆరో విడత హరితహారాన్ని కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారని పేర్కొన్నారు.
''హరితహారంలో అడవుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం. కేసీఆర్ అటవీ ప్రాంతంలోనే మొక్కలు నాటుతారు. కరోనా ప్రభావం వల్ల ముఖ్యమంత్రి పర్యటన సాధాసీదాగా నిర్వహిస్తున్నాం. దయ చేసి ఎవరూ రావద్దు. ఆంక్షల దృష్ట్యా మీరు వచ్చిన అనుమతించలేము. కాబట్టి అందరూ ఆలోచించి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.''
-మంత్రి హరీశ్ రావు
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు అటవీ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో సమీక్షించి దిశానిర్దేశం చేశారు.
ఇవీ చూడండి: 'హరితహారాన్ని పండగలా చేద్దాం... రోడ్లన్నీ పచ్చదనంతో నింపేద్దాం'