ETV Bharat / state

రాహుల్​గాంధీ.. భాజపాపై పోరాడమంటే.. ఇక్కడ మాత్రం..: హరీశ్​ - harish meeting in medak town

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ భాజపాపై పోరాడమంటే.. రాష్ట్రంలోని కాంగ్రెస్​ నేతలు మాత్రం తెరాసపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి హరీశ్ మండిపడ్డారు. దుబ్బాక ఉపఎన్నికల కోసం కాంగ్రెస్​, భాజపాలు చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు.

harish rao
రాహుల్​గాంధీ.. భాజపాపై పోరాడమంటే.. ఇక్కడ మాత్రం..: హరీశ్​
author img

By

Published : Oct 4, 2020, 5:26 PM IST

నిజాం పాలన నుంచి తెలంగాణ వచ్చేంతవరకు రైతులు.. ప్రభుత్వానికి వన్నులు కట్టారని.. మంత్రి హరీశ్​రావు అన్నారు. ఆ చరిత్రను తిరగరాసి సీఎం కేసీఆర్​.. రైతులకు పెట్టబడి సాయం కింద రూ.10 వేలు ఇచ్చారన్నారు.

మెదక్ పట్టణంలోని జీకేఆర్​ గార్డెన్​లో మంత్రి హరీశ్​రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్​ హుస్సేన్​ ఆధ్వర్యంలో ఐదుగురు కాంగ్రెస్​ కౌన్సిలర్​లు తెరాసలో చేరారు. వారందరికి హరీశ్​రావు.. గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

harish rao
రాహుల్​గాంధీ.. భాజపాపై పోరాడమంటే.. ఇక్కడ మాత్రం..: హరీశ్​

వారిది చీకటి ఒప్పందం..

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ భాజపాపై పోరాడమంటే.. రాష్ట్రంలోని కాంగ్రెస్​ నేతలు మాత్రం తెరాసపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి హరీశ్ మండిపడ్డారు. దుబ్బాక ఉపఎన్నికల్లో కాంగ్రెస్​, భాజపాలు చీకటి ఒప్పందం చేసుకున్నాయని హరీశ్​రావు ఆరోపించారు. అందువల్లనే ఇప్పటి వరకు కాంగ్రెస్​ పార్టీ కనీసం కార్యకర్తల సమావేశం కూడా పెట్టలేదన్నారు. తెరాసను ఎదుర్కొలేక ఇరుపార్టీలు కుమ్మక్కయ్యాయని విమర్శించారు. వ్యవసాయ బిల్లులపై భాజపా విమర్శించడం మాని.. తెరాసను తిడుతున్నారని.. కాంగ్రెస్​ తీరును ప్రజలు నవ్వుకుంటున్నారని హరీశ్​ ఎద్దేవా చేశారు.

మెదక్​కు త్వరలో రైలు సదుపాయం అందుబాటులోకి రానుందని హరీశ్​ అన్నారు. రింగ్​ రోడ్​ సహా పర్యటక ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్​ ముగిసిన తర్వాత మెదక్​లో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను పంపిణీ చేస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలుచేస్తున్నట్లు మెదక్​ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి అన్నారు.

పింఛన్​ రావడంలేదంటూ...

మంత్రి హరీశ్​ ప్రసంగం అనంతరం.. పింఛన్లు, నీళ్లు, డబుల్​ బెడ్​రూం ఇళ్లు మంజూరు కావడం లేదంటూ పలువురు మహిళలు గళమెత్తారు. 60 ఏళ్లు నిండినా.. పింఛను రావడం లేదంటూ పలువులు కన్నీటిపర్యంతం అయ్యారు. ఎన్నిసార్లు ధరఖాస్తు చేసినా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు.

ఇవీచూడండి: 'కేంద్రం నుంచి నిధులు తెచ్చాకే... దుబ్బాకలో ఓట్లు అడగాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.