ETV Bharat / state

Harish Rao: నర్సాపూర్​ అభివృద్ధికి ప్రత్యేక నిధులు: మంత్రి హరీశ్ - తెలంగాణ వార్తలు

నర్సాపూర్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. రూ.11కోట్లతో భవనాలను పూర్తి చేస్తామని అన్నారు.

minister harish, narsapur town
మంత్రి హరీశ్, నర్సాపూర్ పట్టణం
author img

By

Published : Jun 25, 2021, 12:15 PM IST

మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో పలు అభివృద్ది కార్యక్రమాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. వైకుంఠధామం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణాలకు భూమిపూజ చేశారు. రూ.11కోట్లతో భవనాలను పూర్తి చేస్తామని అన్నారు. నిర్మాణంలో ఉన్న గ్రంథాలయ భవనాన్ని పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటి... ఆర్డీవో కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

ప్రత్యేక నిధులు

నర్సాపూర్​ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ ఇటీవల రూ.500 కోట్లు నిధులు మంజూరు చేశారని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మహిళా కమిషన్ ఛైర్మన్ సునీతా రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్, లేబర్ వెల్ఫేర్ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ మురళి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

సమీకృత మార్కెట్​కు భూమిపూజ

మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని, నవంబరులో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. గురువారం ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో ఔరంగబాద్‌ శివారులోని నూతన కలెక్టరేట్‌ వద్ద రూ.4.50 కోట్లతో నిర్మించనున్న సమీకృత మార్కెట్‌, రూ.2 కోట్లతో నిర్మించనున్న వైకుంఠధామం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

కలెక్టరేట్ నిర్మాణంపై సమీక్ష

అనంతరం జిల్లా పోలీస్‌ కార్యాలయం, నూతన కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయ నిర్మాణ పనులు నిలిచిపోవడంపై ఎస్పీ చందనాదీప్తిని అడిగి తెలుసుకున్నారు. ఏడాదిగా పనులు నిలిచిపోయాయని ఆమె వివరించారు. ఏడు నెలల్లో కార్యాలయ భవనంతో పాటు ఎస్పీ నివాసగృహ సముదాయం పనులను పూర్తి చేయాలని పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ సంజయ్‌కుమార్‌కు సూచించినట్లు మంత్రి తెలిపారు.

బ్యాడ్మింటన్‌ కోర్టు ప్రారంభం

మెదక్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రూ.4.75 లక్షలతో ఏర్పాటు చేసిన సింథటిక్‌ బ్యాడ్మింటన్‌ కోర్టును మంత్రి ప్రారంభించారు. కొద్దిసేపు మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, పాలనాధికారితో కలిసి హరీశ్‌ బ్యాడ్మింటన్‌ ఆడారు. అనంతరం స్టేడియం ఆవరణలో మంత్రి మొక్క నాటారు. ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న ఆధునికీకరణ పనులను పరిశీలించారు.

ఇదీ చదవండి: కరోనా భయాలు- పాఠశాలలు తెరుచుకునేదెప్పుడు?

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.