ETV Bharat / state

క్రికెట్​ ఆడిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

భవిష్యత్తులో క్రీడల కోసం నాలుగు ఎకరాల్లో మైదానం ఏర్పాటు చేస్తామని మెదక్​ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి హామీ ఇచ్చారు. జిల్లాకేంద్రంలోని సీఎస్​ఐ చర్చి గ్రౌండ్​లో నిర్వహించిన క్రికెట్ టోర్నీ విజేతలకు ఆమె ట్రోఫీ అందజేశారు.

medak mla padma devender reddy  distributed trophies for cricket tournament in medak district
క్రీడల కోసం నాలుగు ఎకరాల్లో మైదానం: పద్మా దేవేందర్ రెడ్డి
author img

By

Published : Feb 27, 2021, 6:46 PM IST

క్రికెట్ ఆడేందుకు​ వీలుగా స్టేడియం ఏర్పాటు చేస్తామని మెదక్​ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి తెలిపారు. పట్టణంలోని సీఎస్​ఐ చర్చి మైదానంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ట్రోఫీని ఆమె బహుకరించారు. వారితో కలిసి కాసేపు ఉత్సాహంగా ఎమ్మెల్యే క్రికెట్​ ఆడారు.

భవిష్యత్తులో క్రీడాకారుల కోసం నాలుగు ఎకరాల్లో మైదానాన్ని ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సింథటిక్ ట్రాక్​ కేవలం అథ్లెటిక్స్ క్రీడాకారులకు మాత్రమే అనుకూలంగా ఉంటుందని అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్, వైస్ ఛైర్మన్ మల్లికార్జున్ గౌడ్, కౌన్సిలర్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : పట్టభద్రుల పోరులో విజయమే లక్ష్యంగా భాజపా వ్యూహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.