ETV Bharat / state

హరితహారంలో అందరి భాగస్వామ్యం కావాలి: ఎమ్మెల్యే - మెదక్​ జిల్లా తాజా వార్తలు

"భావితరాలకు హరిత తెలంగాణను అందించాలనే ఉద్దేశ్యంతో హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలి. రైతులందరూ నియంత్రిత పద్ధతి ద్వారా సాగు చేయాలన్న సీఎం కేసీఆర్ సూచనను పాటించాలి." -పద్మా దేవేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే

హరితహారంలో అందరూ భాగస్వామ్యం కావాలి: ఎమ్మెల్యే

author img

By

Published : Jun 30, 2020, 9:11 PM IST

మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డి హరితహారం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. భావితరాలకు హరిత తెలంగాణను అందించాలనే ఉద్దేశ్యంతో హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలన్నారు.

రైతులందరూ నియంత్రిత పద్ధతి ద్వారా సాగు చేయాలన్న సీఎం కేసీఆర్ సూచనను పాటించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందని పద్మా దేవేందర్‌ రెడ్డి ఆకాంక్షించారు. అన్నదాతలను సంఘటితం చేయడమే రైతు వేదికల ముఖ్య ఉద్దేశమన్నారు.

ఇదీ చదవండి: 1 లేదా 2న రాష్ట్ర కేబినెట్ భేటీ? లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.