మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో సోమవారం బోనాల పండుగ ఘనంగా జరిగింది. అమ్మవారి ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జోగినులు బోనం ఎత్తుకుని నృత్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మేకపోట్టేళ్లతో ఫలహారం బండ్ల ఉరేగింపు, పోతురాజుల విన్యాసాలు, యువకుల నృత్యాలు, ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇదీ చూడండి: ఘనంగా మారేడ్‌పల్లి మైసమ్మ బోనాలు