ETV Bharat / state

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం: కలెక్టర్ - telangana news

రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మెదక్‌ జిల్లా కలెక్టర్ యస్.హరీశ్‌ తెలిపారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. దళారీలు, మధ్యవర్తుల మాటలకు మోసపోవద్దని కలెక్టర్ సూచించారు.

Medak District Collector Y Harish
మెదక్‌ జిల్లా కలెక్టర్ యస్ హరీశ్‌
author img

By

Published : Apr 4, 2021, 5:45 PM IST

రైతుల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిగా... రైతుని రారాజును చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారని మెదక్‌ జిల్లా కలెక్టర్ యస్.హరీశ్‌ అన్నారు. రైతు పండించిన పంట మెుత్తాన్ని గిట్టుబాటు ధర కల్పించి... కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ యాసంగిలో జిల్లా నుంచి 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వచ్చే అవకాశముందని తెలిపారు. అందుకనుగుణంగా ప్రాథమిక సహకార సంఘాలు, ఐకేపీ మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో... సుమారు 350 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

వరి ధాన్యానికి కనీస మద్దతు ధర క్వింటాలుకు గ్రేడ్​–ఏ రకానికి రూ. 1,888, సాధారణ రకానికి రూ. 1,868 చెల్లిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకనుగుణంగా రైతులు ధాన్యాన్ని శుభ్రపరచి, ఎండబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. తేమ 17 శాతం మించరాదన్నారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చే ముందు ఒక కిలో నమూనాను చూపించి టోకెన్ పొందాలని తెలిపారు. అందులో చూపిన తేదీన ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకురావాలన్నారు. 72 గంటల్లోగా డబ్బులు ఖాతాలో జమ చేస్తామని పేర్కొన్నారు. ధాన్యం అమ్ముకోవడంలో ఏమైనా సమస్యలు ఎదురైతే సంబధిత అధికారులకు తెలపాలని సూచించారు. టోల్ ఫ్రీ నెం 180042500333 లేదా 1967కు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ తెలిపారు.

ఇదీ చదవండి: థియేటర్‌కి.. పాప్‌కార్న్‌కు సంబంధమేంటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.