ETV Bharat / state

'ఆ పథకం ద్వారా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టొచ్చు' - ఉపాధి హామీ పథకంపై మెదక్ జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ​

మెదక్ జిల్లాలోని అన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఏపీఓలు, ఏఈలతో కలెక్టర్​ హరీశ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టడానికి అవకాశమున్న పనులు గుర్తించాలని అధికారులకు సూచించారు.

medak collector video conference on employment guarantee scheme
'ఆ పథకం ద్వారా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టొచ్చు'
author img

By

Published : Mar 24, 2021, 8:14 PM IST

ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో ఎన్నో శాశ్వతమైన అభివృద్ధి పనులు చేపట్టడానికి అవకాశముందని, ఆ దిశగా పనులు గుర్తించాలని అధికారులకు మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్​ సూచించారు. కలెక్టరేట్ నుంచి అన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పరిషత్ అధికారులు, ఏపీఓలు, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ప్రణాళిక ఇస్తాం..

ఈ పథకం కింద కూరగాయల సాగు, పెరటి తోటల పెంపకం, సంప్రదాయ పంటలు వంటి సుమారు 30 రకాల పనులు చేపట్టవచ్చని కలెక్టర్​ అన్నారు. పాఠశాలలో చేపట్టిన కిచెన్ షెడ్లు, శౌచాలయాలు పూర్తి చేయాలని అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మండలంలో చేపట్టవలసిన అన్ని రకాల పనులపై కార్యాచరణ ప్రణాళిక ఇస్తామని.. అందుకనుగుణంగా లక్ష్య సాధనకు కృషి చేయాలని అన్నారు.

వైకుంఠ ధామాలు, సేగ్రిగేషన్​ షెడ్లు, రైతు కల్లాలను ఏప్రిల్ 15 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. నర్సరీల ఏర్పాటుకు భూములు గుర్తించాలన్నారు. పల్లె ప్రకృతి వనాలు, నర్సరీల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.

ఇదీ చూడండి: పురపాలికల్లో ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌, నాన్​వెజ్​ మార్కెట్: కేటీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.