మెదక్ జిల్లాలో రైతు వేదికలు, వైకుంఠ ధామాలు పక్షం రోజుల్లో పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ హరీష్ ఆదేశించారు. పనులు పూర్తయ్యేలా కాంట్రాక్టర్లపై ఒత్తిడి తేవాలని.. సర్పంచుల సహకారం తీసుకోవాలని సూచించారు.
చర్యలు తీసుకుంటాం..
వైకుంఠ ధామాల నిర్మాణంలో చాలా వెనుకబడి ఉన్నామని తెలిపారు. విధుల్లో అలసత్వం వహించినా, సాకులు చెప్తూ తప్పించుకోవాలని చూసినా ఉపేక్షించేది లేదన్నారు. చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైకుంఠ ధామాలు, రైతువేదికల నిర్మాణాలపై అధికారులతో మండలాల వారిగా సమీక్షించారు. అసంపూర్తి, చివరి దశల్లోని పనులు త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. పూర్తైన వాటికి ఎప్పటికప్పుడు ఎంబీ రికార్డ్ చేసి.. బిల్లుల చెల్లింపుకై ఎఫ్టీఓలో నమోదు చేయాలని సూచించారు.
సహకరించకపోతే?..
నిర్మాణం పూర్తైన వాటికి నీటి సౌకర్యం కల్పించాలన్నారు. భూ వివాదాలుంటే తహసీల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కరించుకోవాలని తెలిపారు. కాంట్రాక్టర్లు, సర్పంచులు సహకరించకపోతే చెప్పాలని సూచించారు.
నిర్మాణాలకు ఇసుక కొరత ఉందని పంచాయతి రాజ్ ఈఈ రామచంద్రా రెడ్డి తెలుపగా.. ఆర్డీఓ సాయి రాంతో మాట్లాడి సరఫరా అయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈఓ కైలాష్, డీఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా పంచాయతి అధికారి తరున్ కుమార్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రైతు వేదికలతో ఎంతో లాభం: కొప్పుల