ETV Bharat / state

'జీవన స్థితిగతులు మెరుగుపరచుకోవాలి... ఆదర్శంగా నిలవాలి' - మెదక్​ కలెక్టర్ హరీశ్ వార్తలు

ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజి, స్త్రీ నిధికి సంబంధించి నిర్దేశించిన భౌతిక, ఆర్థిక లక్ష్యాలను మార్చి 2లోగా అధిగమించేలా కృషి చేయాలని మెదక్​ కలెక్టర్ హరీశ్... అధికారులకు సూచించారు.

medak collector review meeting with officials
'జీవన స్థితిగతులు మెరుగుపరచుకోవాలి... ఆదర్శంగా నిలవాలి'
author img

By

Published : Feb 15, 2021, 8:30 PM IST

మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజి, స్త్రీ నిధి బ్యాంకు ద్వారా అందిస్తున్న రుణాలు, రికవరీపై మండలాల వారిగా సంబంధిత అధికారులతో మెదక్​ కలెక్టర్ హరీశ్ సమీక్ష నిర్వహించారు. ఆర్థిక సంవత్సరం సమీపిస్తున్న నేపథ్యంలో పలు సూచనలు చేశారు.

మహిళలు స్వశక్తితో ఎదిగి ఆర్థిక స్వాలంబన సాధించాలనే ఉద్దేశంతో... రాష్ట్ర ప్రభుత్వం అతి తక్కువ వడ్డీకే మహిళా సంఘాలకు రుణాలు అందిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని జీవన స్థితిగతులను మెరుగుపరచుకోవాలని... ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఏ ఉపాధి కార్యక్రమాలకు రుణాలు అవసరమో తెలుసుకుని... వివరాలు సేకరించి తదనుగుణంగా వారిని ప్రోత్సాహించాలన్నారు. సాంకేతికపరమైన సమస్యలుంటే డీఆర్​డీవోను సంప్రదించాలని పేర్కొన్నారు. నిరుత్సాహ ప్రగతి ఉన్న ప్రాంతాలను తరచూ సందర్శించి... అక్కడి మహిళలలో అవగాహన, చైతన్యం కలిగించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఇదీ చూడండి: భూమి ఉన్నంత వరకు కేసీఆర్​ సంక్షేమ ఫలాలు అందుతాయి: కవిత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.