మెదక్ జిల్లాలో మరో కొత్త మండలాన్ని ఏర్పాటు చేస్తూ త్వరలోనే ఉత్తర్వులు జారీ కానున్నాయి. తూప్రాన్ రెవెన్యూ డివిజన్లో మాసాయిపేట మండలంగా ఏర్పడనుంది.
నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు నూతన మండలం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. చేగుంట మండలంలోని మూడు, యెల్దుర్తి మండలంలోని ఆరు గ్రామాలు కలిపి మొత్తం తొమ్మిది గ్రామాలతో మాసాయిపేట మండలం ఏర్పాటు కానుంది. కొత్త మండల ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే జారీ అవుతాయని సీఎంఓ కార్యాలయం స్పష్టం చేసింది.