ETV Bharat / state

వనదుర్గామాత సేవలో మంత్రి హరీశ్​రావు

మెదక్ జిల్లాలోని ఏడుపాయలలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి హరీశ్ రావు వన దుర్గాభవాని మాతకు పట్టు వస్త్రాలు సమర్పించారు.

వనదుర్గామాత సేవలో మంత్రి హరీశ్​రావు
వనదుర్గామాత సేవలో మంత్రి హరీశ్​రావు
author img

By

Published : Mar 11, 2021, 1:37 PM IST

Updated : Mar 11, 2021, 2:12 PM IST

మహాశివరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఏడుపాయలలో అత్యంత అట్టహాసంగా జరుగుతున్నాయని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. మెదక్ జిల్లాలోని ఏడుపాయలలోని వేడుకలకు ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరై.. అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయాన్ని చేరుకున్న మంత్రిని.. పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడుపాయల ఉత్సవాలు దినదినాభివృద్ధి చెందుతుందని మంత్రి తెలిపారు ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి సంవత్సరం ఒక కోటి రూపాయల నిధులు మంజూరు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

Mahashivaratri celebrations are in full swing in Yedupayal in Medak district. Minister Harish Rao on behalf of the state government presented silk garments to Vana Durga Bhavani Mata for the occasion
ఏడుపాయల వేడుకల్లో మంత్రి హరీశ్ రావు

మరింత అభివృద్ధి చేస్తాం....

భక్తుల స్నానాల కోసం సింగూరు నుంచి 0.35 టీఎంసీల నీటిని విడుదల చేయడం జరుగుతుందని వివరించారు. తెరాస ప్రభుత్వం ఆధ్వర్యంలో పోతంశెట్టి పల్లి నుంచి ఏడుపాయల వరకు వంద ఫీట్ల సీసీ రోడ్, డివైడర్​ను ఏర్పాటు చేసేందుకు 36 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కాలేశ్వరం సింగూరు నీళ్లు ద్వారా ఈ ప్రాంత ప్రజలంతా సుభిక్షంగా సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ దేవాలయాలకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి జాతరలను అత్యంత వైభవంగా జరిపిస్తున్నారని వివరించారు. ఏడుపాయలను మరింత అభివృద్ధి చేయడం కోసం వచ్చే సంవత్సరం వరకు 50 లక్షల రూపాయలతో మహిళల కోసం స్నానఘట్టాలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

వినియోగించుకోండి...

వనదుర్గామాత సేవలో మంత్రి హరీశ్​రావు

అలాగే ఏడుపాయలు నేరాలను నియంత్రించడం కోసం ఇప్పటికే పోలీసు ఔట్ పోస్టును ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. భక్తుల కోసం ఆర్టీసీ తరపున పెద్ద ఎత్తున బస్సులు నడపటం జరిగిందని భక్తులందరూ వాటిని వినియోగించుకోవాలని సూచించారు. అలాగే ఏడుపాయలు అన్ని సౌకర్యాలతో ఆర్టీసీ బస్టాండ్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాబోవుకాలంలో ఏడుపాయల్లో దుకాణాల సముదాయన్నీ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీష్, ఆలయ ఈవో సారా శ్రీనివాస్ ఉన్నారు..

ఇదీ చదవండి:ఉపవాసం చేస్తున్నారా..? అయితే ఈ పోషకాలు తీసుకోండి..!

Last Updated : Mar 11, 2021, 2:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.