మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో రోడ్డుపై లారీ నానా బీభత్సం సృష్టించింది. రోడ్డు మీద గల ఓ టిఫిన్ సెంటర్ వద్ద ఉదయం సమయంలో అల్పాహారం చేస్తున్న జనాల మీదికి లారీ దూసుకెళ్లింది. దూరం నుంచే గమనించిన జనాలు భయంతో పరుగులు తీశారు. అదుపు తప్పిన లారీ.. ఆర్టీసీ బస్సును గుద్దుకొని... గోడను ఢీకొట్టి ఆగిపోయింది. టిఫిన్ సెంటర్లోని గ్యాస్ సిలిండర్ లారీ టైర్ కిందకు దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు పేలలేదు.
ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కూడా కాలేదు. సిలిండర్ పేలినా.. ప్రజలు అప్రమత్తమై పరుగులు పెట్టకపోయినా.. పెద్ద నష్టమే జరిగేది. పెద్ద ప్రమాదం తప్పడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చూడండి: శరవేగంగా వైరస్ వ్యాప్తి.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు