మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం కామారం శివారులో చిరుత పులుల సంచారంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. గత రాత్రి గ్రామ సమీపంలోని రహదారిపై మూడు చిరుతపులి పిల్లలు కనిపించినట్లు వారు తెలిపారు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఆటోపై దాడికి యత్నించినట్లు చెప్పారు. చిరుతల సంచారం విషయమై గత కొన్ని నెలల నుంచి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని అన్నారు.
చిరుత పులుల భయంతో రాత్రంతా నిద్ర లేకుండా జాగారం చేశామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో టపాకాయలు కాల్చి, మంటలతో వాటిని తరిమి వేశామని తెలిపారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామన్నారు. చిరుతలను వెంటనే బంధించి తీసుకువెళ్లాలని అటవీశాఖ అధికారులను కోరుతున్నారు. ప్రజలందరూ ఒంటరిగా ప్రయాణం చేయరాదని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇదీ చదవండి: 'సోషల్ మీడియా ద్వారా గందరగోళం సృష్టించినా నేరమే'