మెదక్ నియోజకవర్గంలోని సర్దన గ్రామం నుంచి ఇసుక తరలింపులో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఆరోపించారు. అధికార పార్టీనేతలు కాంగ్రెస్ నాయకులపై అక్రమంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మంత్రి హరీశ్ రావు పర్యటన అడ్డుకుంటామన్న భయంతో.. ప్రతి పక్ష కౌన్సిలర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు.
అభివృద్ధి పేరిట - అవినీతి
హవేలి ఘనపూర్ మండలం నాగపూర్ లో అక్బర్ పై రౌడీ షీట్ పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని తిరుపతి రెడ్డి మండిపడ్డారు. అధికార పార్టీ నేతల బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా ఇలాంటి చర్యలను ఆపేయాలని.. లేని పక్షంలో అభివృద్ధి కార్యక్రమాల పేరిట జరుగుతున్న అవినీతిని బయట పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని హెచ్చరించారు.
ఇదీ చూడండి: చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొన్న కేసీఆర్ దంపతులు