గ్రామాల్లో ఉన్న రైతుల సమస్యలను పరిష్కరించడానికే భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం చేపట్టామని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. నర్సాపూర్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న వాటిని రెవెన్యూ సిబ్బంది ఎప్పటికప్పడు ఆన్‌లైన్‌లో సరిచేస్తున్నారని తెలిపారు. భూమి ఉన్నదానికంటే అధికంగా రికార్డులో నమోదవుతున్నందునే సమస్యలు వస్తున్నాయన్నారు. జిల్లాలో సమస్యలు అధికంగా ఉన్నచోట్ల ప్రత్యేకంగా భూరికార్డుల ప్రక్షాళనను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండిః వసతిగృహంలో బాలిక మృతి ఘటనపై ఎస్సీ కమిషన్ ఆరా